Bharath | ఉత్సహంగా శ్రేష్ఠ భారత్ .. సంకల్ప యాత్ర కార్యక్రమం

Bharath | ఉత్సహంగా శ్రేష్ఠ భారత్ .. సంకల్ప యాత్ర కార్యక్రమం
Bharath |దుర్గి, ఆంధ్ర ప్రభ: మండలకేంద్ర మైన దుర్గి ఏపీ మోడల్ స్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ సంకల్ప యాత్ర కార్యక్రమంను ఉపాధ్యాయులు, విద్యార్థులు విన్యాసాలతో ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రా ల ప్రజల మధ్య జాతీయ సమగ్రతను పెంచటానికి, సాంసృతిక రంగాన్ని బలోపేతం చేయటానికి దేశ వ్యాపత్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూ గ్రామ గ్రామాన ప్రచారం గావిస్తున్నారు. దీని వలన భాషా, ఆహారం, సంగీతం, కళలు, పరస్పర అవగాహనా పెంపొదిస్తాయి అన్నారు. ఏసెంసీ చై ర్మన్ సూరె వెంకటేశ్వర్లు మాట్లా డుతూ 31 అక్టోబర్ 2015న సర్ధార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతిని పుర స్కరించుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడి ఈ కార్యక్రమం ను ప్రారంభం చేశారన్నారు. విద్యార్థులచే ప్రదర్శించిన విన్యాసాలతో కూడిన వివిధ రకాల మ్యా పులు చూపారులను ఆకర్షించాయి .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
