ప్రపంచ మేధావి అంబేద్కర్….

ప్రపంచ మేధావి అంబేద్కర్….

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రపంచ మేధావి అంబేద్కర్ అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బోండాఉమా మహేశ్వర రావు సారథ్యంలో నిర్వహిస్తున్న భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా.భీం రావు అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ఆహ్వాన పత్రిక, పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ తెలుగు యువత అధ్యక్షుడు బెజ్జం జయపాల్, అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మద్దాల చక్రవర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గం దళిత నాయకులు నందేటి ప్రేమ్ కుమార్, బుదాల సురేష్, సెంట్రల్ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వర రావుని కలిసి ఆవిష్కరించటం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల14వ తేది అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలువురు అంబేద్కర్ అభ్యుదయ భావాలు కలిగిన ప్రముఖులను సన్మానించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్. రుక్మిణి, కె. దేవమని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply