Bhagyashri Borse | దశ తిరిగినట్టేనా..?

Bhagyashri Borse | దశ తిరిగినట్టేనా..?

Bhagyashri Borse, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ భాగ్యశ్రీ. ఈ అమ్మడు తొలి సినిమాలో అందం, అభినయంతో ఆకట్టకుంది కానీ.. ఆ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత భాగ్యశ్రీ నటించిన సినిమా కింగ్ డమ్. విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఇలా భాగ్యశ్రీ నటించిన మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ సినిమాలు ప్లాప్ అవ్వడంతో అమ్మడు కెరీర్ డౌట్ లో పడింది.

రీసెంట్ గా.. కాంత సినిమా రిలీజైంది. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ కు జంటగా భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమాలో అలనాటి నటిగా పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించి విమర్శల ప్రశంసలు అందుకుంది. అయితే.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఇలా భాగ్యశ్రీ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే.. కెరీర్ లో ముందుకు వెళ్లడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నో అంచనాలతో ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra king Taluka) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పి.మహేష్ బాబు తెరకెక్కించిన ఆంధ్ర కింగ్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్ సీస్ లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ తో.. రామ్, (Hero Ram) భాగ్యశ్రీ అమెరికా వెళ్లి మరీ.. అక్కడ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి తను నటించిన సినిమా సక్సెస్ అవ్వడంతో భాగ్యశ్రీ ఫుల్ హ్యాపీగా ఫీలవుతుందట. మరి.. భాగ్యశ్రీ దశ తిరిగినట్టేనా..? ఇక నుంచి చేసే సినిమాలతో కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

Leave a Reply