గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 9
సుహృన్మిత్రార్యుదాసీన –
మధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్‌యతే ||
తాత్పర్యము : శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారలను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి చెందిన వానిగా పరిగణింపబడును.
భాష్యము : ఈ శ్లోకానికి భాష్యము లేదు.
ఓం తత్సదితి శ్రీమద్భగవ ద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
కర్మసన్న్యాసయోగోనామ పంచమోధ్యాయ: ||
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి ాభక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..