భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో సత్తుపల్లి – అశ్వారావుపేట జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . జాతీయ రహదారిపై ఎదురెదురుగా లారీ ,డీసీఎం వ్యాను ఢీకొన్నాయి . ఈ ఘటనలో నాగాలాండ్ కు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా , మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి .రోడ్డుకు అడ్డంగా వాహనాలు పడిపోవటంతో ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి .
గాంధీనగరం వద్ద..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం జాతీయ రహదారిపై లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భార్యా భర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు . మృతుల వివరాలు తెలియాల్సి వుంది .
ఉరి వేసుకుని యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని పార్కెలగండి లో కోండ్రు శివ (18) అనే యువకుడు ఆదివారం తెల్లవారుఝామున ఉరివేసుకుని ఆత్మహత్య వివరాలు తెలియాల్సి వుంది .