Bhadrachalam | స్నానానికి వెళ్లి..

Bhadrachalam | స్నానానికి వెళ్లి..

Bhadrachalam | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : భద్రాచలం శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుల్లో ఐదుగురు గల్లంతు కావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురుషోత్తమపట్నం పంచాయతీ పరిధిలోని కొల్లుగూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది. భద్రాచలం పట్టణానికి చెందిన ఏడుగురు గోదావరిలో స్నానానికి వెళ్లగా, వారిలో ఐదుగురు లోతు తెలియక నదిలో మునిగిపోయినట్లు సమాచారం.

ఒడ్డున ఉన్న ఇద్దరు వెంటనే డయల్ 100కు సమాచారం అందించగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన స్థలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో భద్రాచలం పోలీసులు ఎటపాక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భద్రాచలం, ఎటపాక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో కొందరు రామాలయంలో పనిచేసే ఉద్యోగుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

bhadrachalam | గోదావరిలో మునిగి ఐదుగురు గల్లంతు

భద్రాచలంలో విషాదం…

భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం అనుకోని వున్న కూనవరం రోడ్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొల్లుగూడెం సమీపంలో భద్రాచలం పట్టణానికి చెందిన ఓ ఏడుగురు నది స్నానం కోసం వెళ్ళారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో గోదావరి లోతుపై అవగాహన లేక ఐదుగురు గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. మిగిలిన ఇద్దరు స్నేహితులు మునిగిపోతున్న వారిని గుర్తించి భద్రాచలం పోలీసులకు సమాచారం తెలిపారు.

సంఘటన ప్రాంతం ఆంధ్ర పరిధిలో ఉండటంతో భద్రాచలం పోలీసులు ఎటపాక పోలీసు స్టేషన్కు తెలిపారు. భద్రాచలం, ఎటపాక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    CLICK HERE TO READ MORE : Govt Bus | 8మంది అక్కడికక్కడే మృతి

    CLICK HERE TO READ MORE

    Leave a Reply