భద్రాచలం పాదయాత్ర..

భద్రాచలం పాదయాత్ర..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి దర్శనానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీరామ మాలధారణ స్వామి ఆదివారం పాదయాత్ర ద్వారా స్వామివారి సన్నిధికి తరలి వెళ్లారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి కట్టుకొని శ్రీరామనామం స్మరిస్తూ పాదయాత్రగా తరలివెళ్లారు. పాదయాత్రకు 14వ వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమార్ తోపాటు భక్తులు ఘన స్వాగతం పలికి స్వామి వారి దివ్య దర్శనం దివ్యంగా జరగాలని ఆకాంక్షించారు.
