Betting App | ఒక్కో వీడియోకి రూ.90 వేలు తీసుకున్నా …. విష్ణుప్రియ

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం కేసులో చిక్కుకున్న యాంక‌ర్‌, బుల్లితెర న‌టి, బిగ్‌బాస్ కంటెస్ట్ విష్ణుప్రియ విచార‌ణ ముగిసింది. పోలీసులు ఇచ్చిన నోటీసు మేర‌కు తన అడ్వకేట్ తో విష్ణుప్రియ పంజాగుట్ల‌ పోలీసు స్టేష‌న్‌కు వచ్చారు. విచార‌ణ‌లో విష్ణుప్రియ ప‌లు అంశాలు వెల్ల‌డించారు. భారీగా డ‌బ్బులు ముట్టిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఒక్కో వీడియోకు రూ.90 వేల వ‌ర‌కు ఇచ్చార‌ని, సుమారు 15 వీడియోలు అప్‌లోడ్ చేసిన‌ట్లు ఆమె తెలిపారు. అదీగాక ఇన్సెంటివ్ కూడా ఇచ్చేవార‌ని తెలిసింది. విష్ణుప్రియ ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేసిన‌ట్లు తెలిసింది.

Leave a Reply