Beth Analysis | మద్యం సేవించి వాహనాలు న‌డిపితే చర్యలు

Beth Analysis | మద్యం సేవించి వాహనాలు న‌డిపితే చర్యలు

  • స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష

Beth Analysis | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం ఎస్సై డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) కార్యక్రమం నిర్వహించి,వాహనాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం సేవించినట్లు బీత్ అనలైజేషన్(Beth Analysis) మిషిన్ తో నిర్ణీత మోతాదు కన్నా ఎక్కువ నిర్ధారణట్లయితే కేసులు పెట్టి,న్యాయస్థానంలో హాజరు పర్చనున్నట్లు ఉన్నట్లు ఆమె చెప్పారు.

ఆ తర్వాత మద్యం ప్రియులకు న్యాయమూర్తులు జరిమానా జైలుశిక్ష, లైసెన్సులను సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుకూడదని,తమకు సహకరించాలని ఆమె కోరారు.

Leave a Reply