సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన 4 గురు లబ్దిదారులకు ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైనా చెక్కులను సోమవారం గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగరి రమేష్ కు రూ.22,000,క్యాతం ప్రతాప్ కు రూ .12,000,సోమా చిన్న బాజన్నకు రూ .48,000, పూజారి పెద్ద రాజన్న కు రూ 22,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ శైలేందర్ తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకి కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కి, టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ కి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కరి ముత్యం, డిసిసి ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక నరేష్, సాదుల్లా, నడుకూడా క్రాంతి, శివరాం యాదవ్, లక్ష్మణ్, దేవేందర్, రాజేష్, వెంకటి, రాజేశ్వర్ గౌడ్, మొకిమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply