బెల్లంపల్లి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం బీఆర్ఎస్ లీడర్లు చెప్పేవన్ని మోసం మాటలే

కాంగ్రెస్ కు ఓటేయండి .. 34 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం
ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా శనివారం బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన 15వ వార్డు అభ్యర్థి చింతల వసంత, 1వ వార్డు అభ్యర్థి మేదరి లక్ష్మి, 2వ వార్డు అభ్యర్థి గోమాస ప్రవీణ్, 14వ వార్డు అభ్యర్థి ముక్కెర సోమశేఖర్, 16వ వార్డు అభ్యర్థి రేగుంట రమాదేవి, 17వ వార్డు అభ్యర్థి రంగంశెట్టి సతీష్, 20వ వార్డు అభ్యర్థి మత్తమారి సరస్వతి తో పాటు 21వ వార్డు అభ్యర్థి ఎలుక ఆకాష్ తరఫున ఓటర్లను కలిసి ‘హస్తం’ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచార సభల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గానికి కానీ, ఇక్కడి ప్రజల సంక్షేమానికి కానీ ఎలాంటి న్యాయం జరగలేదని తీవ్రంగా విమర్శించారు.
ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదని మండిపడ్డారు.నేడు అధికార్ం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పాలనపై అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. డెవలప్ మెన్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా ఉపయోగపడే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి చెందాలన్నా, స్థానిక సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే బెల్లంపల్లి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చర్ల మల్లయ్య, చిలుముల శంకర్, ఎలుక ఆకాష్, కటకం సతీష్, రేవెల్లి రాజలింగు, మత్తమారి సూరిబాబు, దేవసాని ఆనంద్, కాశిపాక జీవరత్నం, కన్నూరి వెంకటేశ్వర్లు, దెబ్బేటి రమేశ్, పులియాల మల్లేష్, చింతల లోకేశ్వర్, బొల్లి వంశి, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.
