Bellampalli | గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..

కాసిపేట,ఏప్రిల్ 18 (ఆంధ్రప్రభ) బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలని లో నివాసం ఉంటున్న పోలీస్ కానిస్టేబుల్ బి ధరమ్ పాల్ (సుమారు 46 సం) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు కు గురై మృతిచెందారు. ములుగు జిల్లా కేంద్రంలోనీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ప్రయాణం చేసివచ్చిన ధరమ్ పాల్ పడుకున్నారని, శుక్రవారం తెల్లవారున విధులకు వెళ్ళేందుకు సిద్ధం చేసేందుకు, ధరమ్ పాల్ భార్య, అతన్ని నిద్రలేపే ప్రయత్నం చేయగా, అప్పటికే అపస్మారక స్థితిలో వున్న అతడిని గమనించి, వెంటనే 108 లో బెల్లంపల్లి ఆసుపత్రి కి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన ఆసుపత్రి సిబ్బంది, ధరమ్ పాల్ అప్పటికే మృతి చెందివున్నారని నిర్ధారించినట్టు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య శిరీష ఆసిఫాబాద్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు.

Leave a Reply