Bell Company | పాపం యువ‌కుడు..

Bell Company | పాపం యువ‌కుడు..

Bell Company | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని కాసానిగూడెంకు చెందిన ఈడే గిరీశ్ కుమార్ బెల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నాడు.

గిరీశ్ కుమార్ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. అయితే తీసుకున్న రుణం కట్టలేకపోవడంతో వేధింపులు మొదలయ్యాయి. దాంతో గిరీశ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Bell Company |

మచిలీపట్నం కాసాని గూడెం ప్రాంతం కు చెందిన ఈడే గిరీష్ కుమార్ (28) అనే యువకుడు లోన్ యాప్ సిబ్బంది వేధింపులు తాళలేక శుక్రవారం పాయిజన్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ వేధింపులు తాళలేక అద్దాంతరంగా యువకుడు తనువు చాలించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈడే గిరీష్ కుమార్ అనే యువకుడు నిమ్మకూరు బెల్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

మచిలీపట్నం కాసాని గూడెం రామాలయ ప్రాంతంలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లి గృహిణి గా ఉంటుంది. తండ్రి ఇటీవల మరణించడంతో కుటుంబ పోషణ బాధ్యత యువకుడు పై పడింది. యువకుడు ఈ మధ్యకాలంలో ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ లో 70000 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ప్రతి నెల లోన్ యధావిధిగా చెల్లిస్తున్నాడు. అయితే కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో లోన్ చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కోవటంతో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారు. లోన్ యాప్ సిబ్బంది వేధింపులు ఎవరితో చెప్పుకోలేక, వేధింపులు రోజురోజుకీ మితిమీరటంతో యువకుడు గత్యంతరం లేని పరిస్థితులలో పాయిజం సేవించి మృతి చెందాడు.

Bell Company |

యువకుడు మృతితో కాసాని గూడెం ప్రాంతం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగింది. ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. లోన్ యాప్ వేధింపుల వల్ల యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply