Devotees | నకిలీ వెబ్‌సైట్లతో బీకేర్‌ఫుల్
- వాటిని ఆశ్రయించి భక్తులు మోసపోవద్దు
- స్పర్శ దర్శనం, ఆర్జిత వసతి గృహాలకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో…
- అసలైన వెబ్‌సైట్లను పొందుపరిచాం
- నేటి నుంచి నూతనంగా అమలు
- ఆలయ కార్యనిర్వహణాధికారి
Dovotees | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam) భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కార్యనిర్వాహణాధికారి యం. శ్రీనివాసరావు కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి అమలయ్యే ఈ నూతన కార్యక్రమాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. శ్రీశైలం దేవస్థానంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారికి జరిగే అన్ని ఆర్జితసేవలను, స్వామివారి స్పర్శదర్శన టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం మార్పులు చేర్పులతో కల్పించమన్నారు.
శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చన్నారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు (The devotees) వసతిని కూడా ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు.
ఇందుకోసం భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.srisailadevasthanam.org లను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా శ్రీస్వామి వారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను, ఆర్జితసేవా టిక్కెట్లను పొందవచ్చునని అన్నారు. అయితే 150 రూపాయల రుసుముతో గల శీఘ్రదర్శనం, 300 రూపాయల రుసుముతో గల అతిశీఘ్రదర్శనం టిక్కెట్లను మాత్రం ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చునన్నారు. ఈ టికెట్లలో 30శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో ఇవ్వబడగా, తక్కిన 70 శాతం టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇవ్వబడుతున్నాయన్నారు.
టిక్కెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయాని కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను పొందే అవకాశం కల్పించబడిందన్నారు. కాగా, ఆర్జితసేవా కర్తలు, స్పర్శదర్శనం టిక్కెట్ పొందిన వారు విధిగా ఆన్‌లైన్ ద్వారా పొందిన టిక్కెట్ (Ticket) ప్రింట్ కాపీని, ఆధార్‌కార్డు నకలును తమవెంట తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా పొందిన ఆయా టిక్కెట్లను స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆర్జిత సేవాకర్తలను, స్పర్శదర్శనం టిక్కెట్లు పొందిన వారిని అనుమతించడం జరుగుతుందన్నారు. ఇందుకు గాను భక్తులు టిక్కెట్ ప్రింటు కాపీని, ఆధార్ కార్డ్ ప్రతిని, ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుందన్నారు.
కాగా సామాన్య భక్తుల సర్వదర్శనానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను అర్జితసేవలు నిర్దిష్ట వేళలలో జరిపించ బడుతున్నాయన్నారు. అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనం కూడా నిర్దిష్ట వేళల్లోనే కల్పించబడుతుందన్నారు. కాబట్టి ఆన్‌లైన్ (Online) ద్వారా టిక్కెట్లు పొందిన ఆర్జితసేవాకర్తలకు టిక్కెట్ పై సూచించిన సమయంలో మాత్రమే ఆయా ఆర్జితసేవలు జరిపించబడుతాయని పేర్కొన్నారు. సేవాకర్తలు వారిసేవా సమయం కంటే కనీసం 15 నిమిషాలు ముందుగా ఆర్జితసేవా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే స్పర్శదర్శనం టిక్కెట్ పొందిన భక్తులకు కూడా టిక్కెట్‌పై పొందుపర్చబడిన సమయంలో మాత్రమే స్పర్శదర్శనం కల్పించబడుతుందన్నారు. భక్తులందరూ కూడా దేవస్థానం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని కార్యనిర్వహణాధికారి భక్తులకు

