Medical Camp | మూర్చ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Medical Camp | నర్సంపేట, ఆంధ్రప్రభ : మూర్చ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అమృత్ రెడ్డి (Dr. Amruth Reddy) తెలిపారు. ఈ రోజు నర్సంపేట గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఈ రోజు మూర్చ వ్యాధిగ్రస్తులకు అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యూరో ఫిజీషియన్ డాక్టర్ అమృత్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి (Dr. Lekkala Vidyasagar Reddy) మాట్లాడుతూ.. మూర్చ వ్యాధి వచ్చినప్పుడు దగ్గరలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని, చేతిలో ఇనుప వస్తువులు పెట్టకూడదన్నా రు.
మూర్చ వచ్చి తను స్పృహలోకి వచ్చాక వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. బీపీ కోసం మందులు వాడుతున్న రోగి డాక్టర్ ను సంప్రదించకుండా బీపీ కంట్రోల్ లో ఉందని మాత్రలు వేసుకోవడం మానొద్దని తెలిపారు. మూర్చ రోగి సమయానికి వైద్యం అందుకోలేకపోతే భవిష్యత్తులో(In the future) జ్ఞాపకశక్తి మందగించడం, నరాలు సచ్చుపడిపోవడం పక్షవాతం లాంటి జబ్బులకు గురవుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధు హాస్పిటల్ డైరెక్టర్లు గోనే యువరాజు, బిరం నాగిరెడ్డి, అనంతగిరి రవి, చారి, పీఆర్ఓలు రవి రెడ్డి, బాలకృష్ణ, నవీన్, పలువురు రోగులు పాల్గొన్నారు.
