BC | బీసీ రిజర్వేషన్లలో అన్యాయం..

BC | బీసీ రిజర్వేషన్లలో అన్యాయం..
- హైకోర్టును ఆశ్రయించిన వెల్దండ యువకుడు..
- నేడు విచారణ..
BC, కల్వకుర్తి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామానికి చెందిన గండికోట రాజు నిన్న హైకోర్టును ఆశ్రయించాడు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కేటాయించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. నేడు అట్టి పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ నెలకొంది.
వెల్దండ మండలంలో 32 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 5 స్థానాలు, 23 శాతం ఉన్న బీసీలకు 4 స్థానాలు కేటాయించినట్లు గండికోట రాజు తెలిపారు. తిమ్మినోని పల్లిలో 8 వార్డులు ఉండగా, వాటిలో నాలుగు ఎస్సీలకు, మరో నాలుగు జనరల్ కు కేటాయించారు. బీసీలకు ఒక్క స్థానం కూడా దక్కలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు.
అదేవిధంగా మండలంలో 12 గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రామాలలో బీసీ జనాభా ఉన్న వాటిని కూడా ఎస్టీలకే కేటాయించినట్లు రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

