పెద్దపల్లిలో…
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 18(ఆంధ్రప్రభ): పెద్దపల్లి (Peddapalli) లో బీసీ బంద్ శనివారం సంపూర్ణంగా విజయవంతమైంది. ఉదయం నుండే వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ లో పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పెద్దపల్లి పట్టణంలో పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి బండ్ సక్సెస్ చేశారు.
పెట్రోల్ బంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు (RTCBuses) నడవక బస్టాండ్ వెలవెలబోయింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన బీసీ బంద్ విజయవంతం అయిందని బీసీ సంఘాల నాయకులు తెలిపారు.