బీసీ బంద్ ఎఫెక్ట్

బీసీ బంద్ ఎఫెక్ట్
(ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్) : కాకతీయ విశ్వవిద్యాలయం (KakatiyaUniversity)లో శనివారం జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ (BC JAC Bandh) పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కలేదు. ఎక్కడి ప్రయాణికులు అక్కడే నిలిచి పోయారు..దాంతో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్.ఎల్.బి, బీటెక్, ఎంఎస్సీ, ఐదవ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, ఎస్ డీఎల్ సి ఈ, సీ ఎల్ ఐఎస్సి, పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కేయూ పరీక్షల నియంత్రణ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
