పాల్గొన్న బీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు

పాల్గొన్న బీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు

చేవెళ్ల, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్‌ పిలుపు చేవెళ్లలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ పార్టీల నేతలు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య పాల్గొని బందుకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంఘాల నాయకులు కసిరే వెంకటేష్, రామగౌడ్, గుండాల రాములు, టేకులపల్లి శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ నాయకులు ఎస్. వసంతం, పీఏసీఎస్‌ చైర్మన్ లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎస్.వసంతం, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామస్వామి, భాజపా మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంతరెడ్డి, ఆంజనేయులు, మాజీ ఎంపీపీ ఎం.బాల్ రాజ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దల ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply