ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బత్తిని తేజశ్రీ

ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బత్తిని తేజశ్రీ

  • ప్రాథమిక విద్య ప్రయివేటు సంస్థలో…
  • ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాలలో

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఇంటర్ ప్రధమ సంవత్సరం ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పనకబండ గ్రామానికి చెందిన బత్తిని తేజశ్రీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ప్రభాకర్,స్వప్న లు తెలిపారు. ప్రధమ సంవత్సరంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ప్రధమ ర్యాంక్ సాధించింది.

1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు మోత్కూర్ లోని సెక్రెడ్ హార్ట్ హై స్కూల్ లో చదవగా,7 నుండి 10 వ తరగతి వరకు మూటకొండూరులోని మహాత్మా జ్యోతి రావ్ పూలే స్టడీ సెంటర్ లో, ఇంటర్ ప్రధమ సంవత్సరం రామన్నపేట మండలం జనంపల్లి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో చదివింది.తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తు తన కుమార్తె ని ఉన్నత చదువులు చదివిస్తుండడం,తేజశ్రీ రాష్ట్ర స్థాయి ప్రధమ ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్తులు,ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply