విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించాలి

విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించాలి

  • బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థిని,విద్యార్థులందరూ అత్యున్నత మార్కులు సాధించాలని బాన్స్ వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు.మండలంలోని ఖండేబల్లూర్, కౌలాస్, జుక్కల్ తదితర హైస్కూల్ లను సందర్శించిన ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. ఆయా సబ్జెక్టులపై విద్యార్థులకు ఉన్న పట్టును అడిగి తెలుసుకున్నారు.పదవ తరగతి పరీక్షలను ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో రాయాలని,భయాందోళన చెందేఆవసరం లేదని, పరీక్షల సమయం వరకు మనస్సుపెట్టి విధ్యబోధన చేయాలన్నారు.

పదవ తరగతి పరీక్షలు విద్యార్థిని,విద్యార్థులకు మూల మలుపు అని, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే పైఉన్నతచదువుల్లో సునాయాసంగా విజయం సాదించవచున్నారు. ఉపాధ్యాయులు కూడా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాకుండా,ఏదైనా సబ్జెక్టులు విద్యార్థి వెనుకబడి ఉంటే వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధచూపుతూ ఆ సబ్జెక్టులో రాణించే విధంగా కృషిచేయాలని,ప్రతిరోజు సాయంత్రం ఫలహరంను అందించాలన్నారు.ఈ సందర్భంగా ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ,కౌలస్ సర్పంచ్ భర్త బలరాం సర్, విద్యాశాఖ అధికారి తిరుపతయ్య,తహసీల్దార్ మారుతి,ఉప తహసీల్దార్ హేమలత,గిర్ధవర్ రామ్ పటేల్, ప్రధానోపాధ్యాయులు లాలయ్య,హన్మంత్ రెడ్డి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply