Banswada MLA | కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తో ఆర్థిక భరోసా….

Banswada MLA | కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తో ఆర్థిక భరోసా….

Banswada MLA | రుద్రూర్, ఆంధ్రప్రభ : పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ‌ బాన్సువాడ ఎమ్మెల్యే నివాసంలో రుద్రూర్ మండలంలోని 31మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, 20మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు మొత్తం 51 మందికి రూ.51, 05,916ల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని చిక్కడపల్లిలో 17మందికి, రాయకుర్ లో 13 మందికి ఇందరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. దేశంలోని ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో రుద్రూర్ మండలాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply