Bangla Tense : తారిక్ రీ ఎంట్రీ ..! Andhra Prabha Real News

Bangla Tense : తారిక్ రీ ఎంట్రీ ..! Andhra Prabha Real News
17 ఏళ్ల తరువాత స్వదేశంలో అడుగు
ఢాకాలో అపూర్వ స్వాగతం
భారీ ర్యాలీలో.. జననీరాజనం
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

బంగ్లాదేశ్ అట్టుడికి పోతోంది. (Bangla Tense) ఒక వైపు భారత్ పై వ్యతిరేక వర్గాల హింసాకాండ.. మరో వైపు మితిమీరిన ఆందోళనలు.. ఇంకో వైపు మధ్యంతర ప్రభుత్వం సరికొత్త రాజకీయ వ్యూహాల అమలుతో.. అశాంతి రగిలిపోతున్న తరుణంలో.. 17 ఏళ్ల కిందట దేశాన్ని వీడి లండన్ చేరుకుని ప్రవాస జీవితం గడిపిన.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ (TariQ Rehaman) గురువారం తన భార్య కుమార్తెతో కలిసి (Re Entry Dhaka) ఢాకాలో దిగారు.
Bangla Tense

ఆయన కుటుంబ సభ్యులకు బంగ్లాదేశీయులు అపూర్వ స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చారు. విమానాశ్రయం నుంచి రెహమాన్ పుర్బాచల్ (poorvachal ) లోని 300 ఫీట్ కు చేరుకున్నారు. అక్కడ భారీ ర్యాలీలో (Heavy Rally) ప్రసంగించారు. గత వారం యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత దక్షిణాసియా దేశం బంగ్లాదేశ్ లో హింసాకాండ కొనసాగుతోంది. హిందూ మైనార్టీలపై దాడులు పెరిగాయి. హిందువుల హత్యలు జరుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో రెహమాన్ బంగ్లాదేశ్ కు తిరిగి రావడం చాలా కీలక పరిణామంగా మారింది.

Bangla Tense
మాజీ ప్రధాని ఖలీదా జియా (Ex Pm Khaleeda Jia) కుమారుడు రెహమాన్, ఫిబ్రవరి 2026లో జరగనున్న బంగ్లాదేశ్ ఎన్నికలలో ప్రధానమంత్రి పదవికి బలమైన Power ful Contetast) పోటీదారుడు. యువ నాయకుడు హాది హత్య గత వారం బంగ్లాదేశ్‌లో అశాంతిని రేకెత్తించింది, ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లోని ప్రముఖ మీడియా కార్యాలయాలు, డైలీ స్టార్ , ప్రోథోమ్ అలో కార్యాలయాలను మూకలు తగలబెట్టాయి.

Bangla Tense
ఇక తారిక్ రెహమాన్ రాకతో పరిస్థితి క్లైమాక్స్ స్థాయికి చేరింది. ఈ ర్యాలీలో తారిక్ రెహమాన్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో శాంతి తిరిగి నెలకొనాలని (Re Establish Peace) పిలుపునిచ్చారు. BNP నాయకుడిగా, తనకు ఒక ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. “వివిధ ఆధిపత్య శక్తుల ఏజెంట్లు ఇప్పటికీ కుట్రలలో నిమగ్నమై ఉన్నారు. మనం ఓపికగా ఉండాలి. మనం జాగ్రత్తగా (Be alert) ఉండాలి” అని తారిక్ అన్నారు.

బాహ్య శక్తులు ఏవీ ఆడటం లేదని ఆయన ప్రస్తావించనప్పటికీ, ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందించవద్దని మద్దతుదారులను BNP నాయకుడు కోరారు. “మనమందరం కలిసి దేశాన్ని (Re Construct Country) నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశం కొండలు, మైదాన ప్రాంతాల ప్రజలు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు క్రైస్తవులకు చెందినది. ప్రతి స్త్రీ, పురుషుడు , బిడ్డ ఇంటిని వదిలి సురక్షితంగా (All Safe) తిరిగి వెళ్ళగలిగే బంగ్లాదేశ్‌ను మేము నిర్మించాలనుకుంటున్నాం” అని బిఎన్‌పి నాయకుడు అన్నారు, బంగ్లాదేశీయులు తమ మాట్లాడే హక్కును తిరిగి పొందాలని ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పొందాలని కోరుకుంటున్నారని తారిక్ అన్నారు.

Bangla Tense : భారత్ పై వ్యతిరేకత ఎందుకు?
2024 ఆగస్టులో అధికార భ్రష్టురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా (Ex Pm Haseena) కు భారత్ ఆశ్రయం (Shelter) ఇవ్వడం అక్కడి ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఆమెను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు హాదీ హత్య (Hadi Murder) వెనుక భారత్ హస్తం ఉందనే నిరాధార ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రచారమై భారత్ వ్యతిరేక నిరసనలకు దారితీశాయి.

హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, జమాత్ -ఎ- ఇస్లామీ Jamat E Islami) వంటి కరుడు గట్టిన మత వాద సంస్థల ప్రభావం పెరిగింది. వీరు భారత్ వ్యతిరేక ప్రచారాన్ని బలంగా వినిపిస్తున్నారు. తీస్తా నది నీటి పంపకాలు, సరిహద్దు వద్ద కాల్పులు భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందనే అభిప్రాయం కూడా ఈ వ్యతిరేకతకు దోహదపడుతున్నాయి.

ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం (Pakistan) పాకిస్థాన్, చైనాలతో (China relations) సంబంధాలను పెంచుకోవడానికి మొగ్గు చూపుతూ, భారత్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది . మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ రాయబారులను పిలిపించి మాట్లాడింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వీసా ( Visa) సేవలు కూడా Partially Stoped) పాక్షికంగా నిలిచిపోయాయి.
ALO READ : Bangladesh | మరో హిందూ యువకుడి దారుణ హత్య..
