Bangalore | క‌ళ్ల‌లో కారం కొట్టి.. గాజు పెంకుతో మాజీ డిజిపిని హ‌త్య చేసిన భార్య

బెంగళూరు – కర్నాటకలో దారుణ హత్య జరిగింది. బెంగుళూరులోని త‌న నివాసంలో 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఆయ‌న భార్యే ఈ హత్య చేసినట్టు గుర్తించారు. ఓం ప్రకాష్ హత్య విషయానికి సంబంధించి 112 హెల్ప్‌లైన్‌కు వచ్చిన అత్యవసర కాల్ ద్వారా వెలుగులోకి వచ్చింది.

మృతుడి ఒంటిపై రెండు చోట్ల ప‌దునైన ఆయ‌ధంతో పొడిన పోట్లను సైతం పోలీసులు గుర్తించారు. మాజీ డీజీపీ చనిపోయారని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. దర్యాప్తులో భాగంగా హత్య జరిగినట్టు గుర్తించారు. అయితే అత‌డి భార్య ప‌ల్లవినే హ‌త్య చేసి చంపిందని పోలీసులు పేర్కొన్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి మాజీ డీజీపీ ఓం ప్ర‌కాష్ త‌న భార్య పల్లవికి మ‌ధ్య ఆస్తికి సంబంధించి గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్టు సమాచారం. మాజీ డీజీపీ తన ఆస్తిని భార్య పేరు మీద‌కు కాకుండా ఇతర బంధువుల పేరు మీద‌కు మార్చ‌డం వ‌ల్ల‌నే ఇంట్లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి పోలీసులు తెలిపారు..

గొడ‌వ‌ల నేప‌థ్యంలో భార్య పల్లవి ముందుగా మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ క‌ళ్ల‌లో కారం కొట్టింది. ఆ త‌ర్వాత చేతులు కాళ్లు క‌ట్టిప‌డేసింది.. అక్క‌డే ఉన్న ఒక సీసాను ప‌గుల‌గొట్టి ప‌దునైన గాజుతో అత‌డిని పొడిచి హ‌త్య చేసింది..

ఇది ఇలా ఉంటే కొద్ది కాలంగా పద్మ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య అనంతరం మరో ఐపీఎస్ భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుడిని చంపేశానని రక్తపుమడుగులో ఉన్న భర్త డెడ్ బాడీ చూపించింది. తనను ముందుగా భర్త ఓం ప్రకాశ్ హత్య చేయడానికి ప్రయత్నించాడని..అందుకుగానే చంపేశానని పల్లవి పోలీసులతో చెప్పింది.
ఓం ప్ర‌కాష్ బీహార్ రాష్ట్రానికి చెందిన‌వారు. మొదట ఆయన బళ్లారిలోని హరపనహల్లిలో ఎస్పీగా పని చేశారు. తరవాత కాలంలో అనేక కీలక పోస్టుల్లో విధులు నిర్వహించి 2015 లో డీజీపీగా నియమితులయ్యారు. 2017 సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *