పిల్లలు కనాలంటే 60 ఏళ్లు ఆగాలని రూల్
వివాహమై మూడేళ్లైనా మంచాలు దూరమే
వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే డీజేలతో డ్యాన్స్
విడాకులు కోరితే ₹45 లక్షలు డిమాండ్
భార్య ఆగడాలపై బెంగళూరు పోలీసులకు టెకీ ఫిర్యాదు
గోడు వెళ్లబోసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
బెంగళూరు, ఆంధ్రప్రభ : భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న భర్త గురించి వినే ఉంటారు. కానీ, ఆవిడ తీరు మాత్రం అదో రకంగా ఉంది. తన భార్య సాధిస్తోందని, సతాయిస్తోందని ఓ భర్త కోర్టు మెట్లెక్కాడు. తన పోరు భరించలేకపోతున్నానని బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. నిత్యం దూషించడం, డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో పాటు అడిగినంత ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన దగ్గరకు రావాలంటే ₹5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని, పెళ్లి అయ్యి మూడేండ్లు అయినా తమ మంచాలు ఇంకా దూరంగానే ఉన్నాయని వాపోయాడు.
డెత్ నోట్ రాసి సూసైడ్ చేస్కుంటా..
బెంగళూరు టెక్కీ శ్రీకాంత్‌కు 2022లో ఓ యువతితో వివాహమైంది. పెళ్లి రోజు నుంచి ఒక్కరోజు కూడా సంసారం చేయలేదు. పిల్లలు కావాలని శ్రీకాంత్ భార్యను అడగ్గా, 60 ఏళ్లు వయస్సు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం, ఇప్పుడైతే ఎవరినైనా దత్తతకు తీసుకొందామని సలహాలిచ్చేది. తాళి కట్టిన భార్య కదా అని ముట్టుకోబోతే భగ్గుమనేది. డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించేది. అసలు తనను తాకాలంటే ₹5 వేలు ఇవ్వాలని కండిషన్ పెట్టిందని పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో తెలిపాడు.
పాటలు పెట్టి న్యూడ్ డ్యాన్సులు..
తను వర్క్ ఫ్రమ్ హోంలో డ్యూటీలో ఉంటే.. ఆమె గట్టిగా పాటలు పెట్టి తనను రెచ్చగొట్టేలా న్యూడ్ డ్యాన్స్ చేస్తోందని. ఒక వేళ విడాకులు తీసుకోవాలని అనుకుంటే తనకు ₹45 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రతినెలా భరణం కింద పెద్దమొత్తం ముట్టజెప్పాలని ఆల్టిమేటం జారీ చేసిందని శ్రీకాంత్ తెలిపాడు. ఇంత డబ్బును తానెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బాధితుడు వాపోయాడు. ఇదే కాకుండా వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భార్యకు ఆమె తల్లిదండ్రులు వంత పాడుతున్నారని తెలిపాడు. ఈ మేరకు వయ్యలికావల్ ఠాణాలో అతడు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.