Banda Prakash | హక్కుల సాధనకు ఉద్యమిద్దాం..

Banda Prakash | హక్కుల సాధనకు ఉద్యమిద్దాం..

  • 29న బీసీ మంత్రికి, బీసీ కమిషర్‌కు విన‌తి
  • ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్

Banda Prakash | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : ముదిరాజుల ప్రధాన ఎజెండా బీసీ డీ నుంచి ఏలోకి మార్చితే ఉద్యోగ ఉపాధి విద్య రాజకీయ చైతన్య అవకాశాల్లో తమ కులస్తులకు మెరుగైన అవకాశాలు అందుతాయన్న ఏకైక ఉద్దేశంతో పోరాటం సాగుతుందని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ అన్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో సేకరించిన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించడం జరిగిందని, ఎమ్మార్వో కార్యాలయాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలతో పాటు ముదిరాజుల హక్కులకు బీసీ డీ నుండి ఏలోకి మార్చే ప్రతిపాదన రూపొందించడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందుల కారణంగా పోరాటాన్ని వాయిదా వేసి తిరిగి ప్రారంభించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చేశారు. దీనికోసం ఈనెల 29న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందించి.. ఆ తదుపరి బీసీ కమిషన‌ర్‌కు మెమోరాండం సమర్పణ తదుపరి చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహాసభ రాష్ట్ర నాయకులు జిల్లా నేతలు ఈ కార్యక్రమానికి విధిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply