పట్టాలు ఇప్పించండి బాంచన్

పట్టాలు ఇప్పించండి బాంచన్
- మంద కొమరమ్మ కాలనీ బాధితుల నిరసన
- ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షలు
గోదావరిఖని, ఆంధ్రప్రభ ; ఇండ్ల స్థలాల పట్టాల కోసం 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం… సాకులతో నిర్లక్ష్యం చేయకుండా పట్టాలి పెంచాలని మంద కొమరమ్మ కాలనీ బాధితులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద బాధితులు నిరసనకు దిగారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
దీక్షలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె బాబు, రామగుండం ఏరియా ఇన్చార్జి ధర్మేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…. పట్టణ ప్రాంతంలోని సింగరేణి జిఎం ఆఫీస్ సమీపంలో నిర్మాణం చేసిన మంద కొమరమ్మ కాలనీ వాసులకు ఇండ్ల పట్టాలి ఇవ్వడంలో జరుగుతున్న నిర్లక్ష్యం పై మండిపడ్డారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ఇండ్ల పట్టాల కోసం బాధితులు సింగరేణి పరిశ్రమ ఉన్నతాధికారులను, ప్రభుత్వ రెవెన్యూ ఉన్నతాధికాలను కలిసిన ప్రయోజనం జరగడం లేదన్నారు.
మంద కొమరమ్మ కాలనీ బాధితుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నాయకులు ఈ సందర్భంగా ఎండ కట్టారు. కాలనీ బాధితులకు ఇండ్ల పట్టాలి ఇప్పించే వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం ఆగదన్నారు. బాధిత కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో తెలుపాలని నాయకుల ప్రశ్నించారు. కాలనీ బాధితులకు సింగరేణి చొరవతో ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం కోరారు.
మంద కొమరమ్మ కాలనీవాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చేదాకా రిలే నిరాహార దీక్షలు నిరంతరం కొనసాగుతాయని, అదేవిధంగా బాధితులకు న్యాయం జరగడం కోసం ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్, రాసపల్లి రవికుమార్, జిల్లా కార్యదర్శి మడిపల్లి దశరథం, నాయకులు ఏలూరి రాంబాబు, కాశిపేట సదానందం, గద్దల అనిల్, ఈదునూరి కొమరమ్మ, రాచర్ల రాజేశం, రాధా, అరుణ, సుజాత, సుగుణ, సరోజన, నరసమ్మ, రాజకుమార్ సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
