Bondi beach Hero :  ప్రపంచం ఫిదా Andhra Prabha Real Story

Bondi beach Hero :  ప్రపంచం ఫిదా Andhra Prabha Real Story

 టెర్రరిస్టుకే టెర్రర్​  

ఒంటి చేత్తో తుపాకీ లాక్కుని..

ఉగ్రవాదిని తరిమేసిన రియల్​ హీరో

చిరు పండ్ల వ్యాపారి అహ్మద్​

( ఆంధ్రప్రభ, సిడ్నీ )

ఓ వైపు తుపాకీ గర్జన .. ఇటు తూటాల వర్షం.. పిట్టల్లా రాలుతున్న జనం హాహాకారాలకు ప్రత్యక్షి (Un Sung worier)  .. తట్టుకోలేక పోయాడు. సహించలేక పోయాడు.  తన ప్రాణాలను పణంగా పెట్టి .. సాటి మనుషులను కాపాడేందుకు ఉగ్రవాదితో తలపడటమే కాదు.. తన్ని తరిమేశాడు. అతడే .. ఆస్ట్రేలియా  బోండి బీచ్​ హీరో. (Bodi Beach Hero)  ప్రపంచం ఔరా అని కెవ్వు కేక పెట్టింది.

Bamdi beach Hero

Bamdi beach Hero

 సోషల్​ మీడియా ఏకంగా అతడి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. అతడెవరో కాదు. ఆస్ట్రేలియా సదర్​ ల్యాండ్​ కు (SutherLand)  చెందిన  43 ఏళ్ల చిరు పండ్ల వ్యాపారి ( Fruits Merchant). పేరు అహ్మద్​ ఎల్​ అహ్మద్​. (Ahmed El Ahmed)  ఆయనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఉగ్ర మూకల దాడిని సహించలేక పోయాడు. తన ప్రాణమే కాదు.. తన కుటుంబం గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించలేదు. ఉగ్ర ముష్కరుడిపైకి దూకాడు. ఒంటి చేత్తో తుపాకీ లాక్కున్నాడు. కింద పడిన ఉగ్ర వాది బిక్కచచ్చిపోయాడు. ప్రాణభయంతో పారిపోయాడు.

Bamdi beach Hero

Bamdi beach Hero

అంతమందిని చంపిన ఆ ఉగ్రవాదిని కూడా ఈ అహ్మద్​ ఎల్​ అహ్మద్​ కాల్చి చంపలేదు. ఇదీ అతడిలో శౌర్యమే కాదు.. మానవత్వమూ (Humanity) .. ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రస్తుతం పోలీసులు ఆయననూ అదుపులోకి తీసుకున్నా.. అహ్మద్​ ప్రతాపానికి ఫిదా కాక తప్పలేదు. ఈ దాడిలో అహ్మద్​ గాయపడ్డాడు. భుజానికి (Shoulder Injured)  గాయమైంది. ఇలాంటి ఫైట్స్​ సినిమాల్లో చూస్తాం. మళ్లీ ఆ హీరో డ్యూయెట్​ తో అభిమానులకు కనిపిస్తాడు. మరి ఈ హీరో సామాన్యుడే కానీ.. అసమాన్యుడిగా జనం గుండెల్లో నిలిచాడు.

Bamdi beach Hero

Bamdi beach Hero

ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బాండి బీచ్‌లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడిలో ఒక సామాన్యుడు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు. హనుకా పండుగ సందర్భంగా జరుగుతున్న జ్యూయిష్ కమ్యూనిటీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి 12 మందిని చంపేశారు. అయితే, ఒక మధ్యవయస్కుడైన ఆస్ట్రేలియన్ వ్యక్తి తన ప్రాణాలను పణంగాపెట్టి ఒక ఉగ్రవాదిని పట్టుకుని తుపాకీని బలవంతంగా లాక్కొని, అనేకమంది ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో ఈ ధీశాలి ధైర్యసాహసాలు కళ్లకుకట్టినట్టు కనిపించాయి. బీచ్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఉగ్రవాది కాల్పులు జరుపుతున్నప్పుడు, తెలుపు షర్ట్ ధరించిన ఆ వ్యక్తి ఆకస్మికంగా దాడి చేసి, ఉగ్రవాదిని అడ్డగించి షాట్‌గన్‌ను లాక్కు్న్నాడు. ఆ తర్వాత ఆయుధాన్ని ఉగ్రవాది వైపు తిప్పి, అతన్ని భయపెట్టి వెనక్కి తగ్గించాడు.

Bamdi beach Hero

Bamdi beach Hero

అమెరికాలో బ్రౌన్​ వర్సిటీలో కాల్పులకు తెగబడి ఇద్దరిని హతమార్చిన కిరాతక చర్య గడచిప కొన్ని గంటల్లోనే ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్​ లో ఆగంతకులు మాస్​ కిల్లింగ్ (Mass Killig)​ తెగించారు. యూదుల ఎంతో ప్రేమతో నిర్వహించే దీపాల పండుగ వేళ..(Lights Festival)  ఈ ముష్కరులు తుపాకులు ఎక్కుపెట్టారు. కళ్లకు కనిపించినోళ్లను కనిపించినట్టు పిట్టల్ని కాల్చనట్టు గుళ్ల వర్షం కురిపించారు. ఈ ఉగ్రఘాతుక చర్యలో పది మంది (10 Dead)  అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

Bamdi beach Hero

Bamdi beach Hero

ఈ మృతుల్లో ఒక షూటర్​ కూడ ఉన్నాడు. మరో 12 మంది (12 Injured) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో షూటర్​ చావు బతుకుల్లో ఉన్నాడు. యావత్​ ప్రపంచాన్ని కలవర పెట్టిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  సిడ్నీ నగరంలోని  ప్రముఖ పర్యాటక కేంద్రం బోండి బీచ్‌లో ( Bonidi Beach Fatal Attack )  ఆదివారం ఉదయం  5.00 గంటల సమయంలో ( భారత కాలమానం మధ్యాహ్నం 12.20 గంటలకు)  ఈ నరమేదం జరిగింది. యూదుల పండుగ హనుక్కియా సందర్భంగా.. బాండీ బీచ్​ ఆదివారం ఉదయం నుంచే కిటకిటలాడింది. ఈ రోజు సాయంత్రం దీపాల పండుగ ఈవెంట్ (Lights Event) ​ కు పర్యాటకులు సర్వసన్నద్ధం అయ్యారు. అంతలోనే  భయానక కాల్పుల బీభత్స కాండకు తెరలేచింది. పర్యాటకులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్న  వేళ బీచ్‌లోకి   ఇద్దరు (Two Gun Man)  ముష్కరులు ప్రవేశించారు. 

Bamdi beach Hero

Bamdi beach Hero

 ఒక్కసారిగా విచక్షణరహితంగా కాల్పులు (Mass Firing)  ప్రారంభించారు. ఈ  భయానక పరిస్థితుల్లో   వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్‌ క్లబ్‌కు సమీపంలోని  ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి పైకి చేరుకుని కాల్పులు జరిపారు. ఆదివారం కావడంతో బాండి బీచ్ కు భారీగా పర్యాటకులు వచ్చారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు వినిపించారు. ఇద్దరు దుండగులు భారీ గన్ లతో టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఓ వ్యక్తి సాహసం చేసి షూటర్  నుంచి గన్ లాక్కుకున్నారు.

Bamdi beach Hero

Bamdi beach Hero

 ఇక్కడ ఆదివారం సాయంత్రం జరిగే యూదుల దీపాల పండుగనే టార్గెట్​ చేసుకుని ఈ కాల్పులకు తెగబడినట్టు ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడిని (One militant Dead)  కాల్చి చంపగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన పర్యాలకులను  కాపాడేందుకు హెలికాప్టర్లు (Helicaptors) , 30 అంబులెన్స్‌ (Ambulancens) లను రంగంలోకి దించారు. . ప్రస్తుతం పరిస్థితిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

Bamdi beach Hero

Bamdi beach Hero : ఆరిన దీపాలు

హనుక్కియా  అనేది యూదుల ఎనిమిది రోజుల “దీపాల పండుగ”, ఇది 2,000 ఏళ్ల కిందట  మక్కబీయన్ (Makkabian)  తిరుగుబాటు,  జెరూసలేంలోని రెండవ ఆలయం    పునఃప్రతిష్టను గుర్తుచేసుకునే పండుగ ఇది .  బలవంతపు హెల్లెనైజేషన్‌కు (Anti Hellanization)  వ్యతిరేకంగా యూదుల స్వేచ్ఛ స్థిరత్వంతో ఈ పండుగ జరుపుతారు.   ప్రతి రాత్రి మెనోరా(Monara) (హనుక్కియా) వెలిగించడం, డ్రీడెల్ ఆడటం, లాట్కేస్ (Latcase) (బంగాళాదుంప పాన్‌ కేక్‌లు)   సుఫ్గానియోట్ (డోనట్స్  (Donuts) వేయించిన ఆహారాన్ని తింటారు.  బహుమతులు వాయినాలు పంచుకొంటారు.  ఇది ఎనిమిది రోజుల పాటు ఒకే రోజు విలువైన నూనెను కాల్చడం యొక్క అద్భుతాన్ని సూచిస్తుంది.

Bamdi beach Hero

చానుకా బై ది సీ కార్యక్రమం బోండి బీచ్​ ఆట స్థలంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి  జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికే ముష్కరులు తెగించారని పర్యాటకులు అనుమానిస్తున్నారు.   ఈ ప్రాంతంలో బాంబు బెదిరింపు కొనసాగుతోందని,   IED లేదా ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరంగా ఉందనే సమాచారంతో భద్రత దళాలు జల్లెడ పడుతున్నాయి.  బోండి బీచ్‌లో హృదయ విదారక దృశ్యాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  సముద్ర తీరంలో జనం  చెల్లాచెదురుగా పడి పోయారు, తుపాకీ కాల్పులు, పోలీసు సైరన్‌లు ఈ వీడియోల్లో కనిపించాయి. క్షతగ్రాత్రులకు పారామెడిక్స్ సాయం చేస్తున్నారు.  ప్రజలు ఆ ప్రాంతం నుండి పారిపోతున్నట్లు, మరికొందరి తలలపై బ్యాండేజీలు ధరించి ఉండగా, మరికొందరు రక్తంతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపించింది. బోండి బీచ్ ఉత్తర చివరలో,  బోండి పార్క్ ప్లేగ్రౌండ్ సమీపంలో   సమీపంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Bamdi beach Hero

ALSO READ : Bondi Beach Fatal Attack  :  10 మంది హతం

Leave a Reply