బాల్క సుమ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు

బాల్క సుమ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డ్ లో జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ(BRS party) అధ్యక్షుడు, మాజీ విప్ డాక్టర్ బాల్క సుమన్(Dr. Balka Suman) జన్మదిన వేడుకలను పార్టీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సుమన్(Marishetti Suman), మాజీ కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. బాల్క సుమన్ విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యేగా చెన్నూర్ నియోజకవర్గంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి ప్రజలకు అండగా నిలిచారని, బాల్క సుమన్ ప్రజల నాయకుడని కొనియాడారు. అనంతరం మాజీ మండల ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సుమన్ మాట్లాడుతూ.. నేటి యువత బాల్క సుమన్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

యువత ప్రశ్నించకుండా ఉంటే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందవని, యువత సేవ కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ అధ్యక్షుడు కాసు ధర్మయ్య(Kasu Dharmaiah), ప్రధాన కార్యదర్శి ఒరగంటి శ్రీధర్, వార్డ్ ఉపాధ్యక్షుడు దర్శనల జనార్దన్, పట్టణ నాయకులు బెత్తపు ప్రణీత్, అవునూరి అక్షయ్, అవునూరి పవన్, అడ్లూరి సిద్దార్థ, అడ్లూరి సుకుమార్, శ్యామ్ కుమార్, ఒరగంటి శ్రీకర్, అవునూరి కిరణ్, అవునూరి సాయికుమార్, ప్రవీణ్, స్నుహిత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply