RTC బస్సు స్టీరింగ్ పట్టిన బాలయ్య..

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ప్రత్యేక శైలిలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా బాలయ్య స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపి రచ్చ చేశారు.
విజయవాడలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ప్రారంభించారు. ఆ ముగ్గురు ప్రత్యేక ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అదే సమయానికి, హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య తానే స్టీరింగ్ పట్టి మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చి బస్సు నడిపారు.
బాలయ్య బస్సు డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన ఈ చర్యను ప్రశంసిస్తున్నారు.
