బాలయ్య ఫ్యాన్స్ ఫైర్

  • హిందూపురంలో టెన్షన్
  • బాలకృష్ణపై వైసీపీ నేత వేణు రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
  • బ్యానర్లు, ఫ్లెక్సీలు చించివేత

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : హిందూపురం పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ రగిలింది. వైసీపీ హిందూపురం ఇన్‌ఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి (ycp leader venu reddy) నందమూరి బాలకృష్ణ (nandamuri bala Krishna) పై చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం లేపింది . 40 ఏళ్లుగా హిందూపురం ప్రాంతం ఒకే నాయకుడి ఆధీనంలోనే ఉందని, ప్రజలు “బానిసల”లా (slaves) జీవించాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రధానంగా“ఒక్క నాయకుడు హైదరాబాద్‌లో ఉంటే, ఇక్కడి ప్రజలు వాడి కింద బతకాలా? 40 ఏళ్లుగా ఎవరి కిందో బానిస బతుకులు బతుకుతున్నాం. ఈ పరిస్థితిని మార్చాలి” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వారి వ్యాఖ్యలతో బాలయ్య అభిమానులు ఆగ్రహావేశానికి ( balaiah fans fired) గురయ్యారు. ఆ వెంటనే హిందూపురం వైసీపీ ఆఫీస్ వద్ద గుమికూడిన అభిమానులు అక్కడి బ్యానర్లు, ఫ్లెక్సీలు చీల్చి పారేశారు. (dimontled flexies, banners) కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తూ, ఆఫీస్ చుట్టుపక్కల ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు చేపట్టారు. రెండు వర్గాల మధ్య మాటల దాడులు సోషల్ మీడియాలో కూడా వేడెక్కాయి.

ఈ ఘటనతో హిందూపురం (HIndupuram) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కగా, (political tension) ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పంచులు వేస్తున్నారు.

Leave a Reply