Balakrishna | అసలు ప్లాన్ ఏంటి..?

Balakrishna | అసలు ప్లాన్ ఏంటి..?
Balakrishna | బాలయ్య కోసం దర్శకుల గట్టి పోటీ
వివేక్ ఆత్రేయ vs విజయ్ కనకమేడల
బాలయ్య నిర్ణయం కోసం ఆసక్తి పెరుగుతోంది
టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న బాలయ్య ప్రాజెక్ట్స్
Balakrishna | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ.. అఖండ సినిమా నుంచి వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ.. దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం.. మలినేని గోపీచంద్ తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. అయితే.. నెక్ట్స్ ఏంటి అంటే.. కొన్ని ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. అందులో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి ఫిక్స్ అయ్యారట. ఈ ప్రాజెక్టుల విషయమై ఆ ఇద్దరికి టెన్షన్ స్టార్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు ఎవరు..? టెన్షన్ పడడానికి కారణం ఏంటి..?
Balakrishna | బాలయ్య కోసం గట్టి పోటీ..

బాలయ్య, మలినేని కాంబో మూవీని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాని పట్టాలెక్కించాలని బాలయ్య ఫిక్స్ అయ్యారట. అందుకనే.. ఈమధ్య బాలయ్య వరుసగా కథలు విన్నారట. నెక్ట్స్ మూవీ గురించి చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. క్రిష్ తో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999, హరీష్ శంకర్ తో భారీ చిత్రం, కోలీవుడ్ డైరెక్టర్ తో ఓ భారీ యాక్షన్ మూవీ, యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో భారీ చిత్రం.. తదితర ప్రాజెక్టుల గురించి న్యూస్ లీకైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Balakrishna | వివేక్, విజయ్..

తాజాగా మరో డైరెక్టర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అతనే.. నాంది దర్శకుడు విజయ్ కనకమేడల. ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్య కోసం రౌడీ ఇన్ స్పెక్టర్ తరహాలో ఉండే స్టోరీ రెడీ చేసి వినిపించాడట. ఇలా బాలయ్య కోసం సీనియర్ అండ్ యంగ్ డైరెక్టర్స్ పోటీపడుతుండడంతో.. ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా ఓకే అయ్యింది. త్వరలో ఈ సినిమానే స్టార్ట్ చేస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు విజయ్ కనకమేడల కథ కూడా బాగా నచ్చడంతో ఈ సినిమాని పట్టాలెక్కించాలి అనుకుంటున్నాట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో.. ఈ ఇద్దరు దర్శకులు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల లో టెన్షన్ స్టార్ట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. బాలయ్య ఈ ఇద్దరిలో ఎవరితో ముందుగా సినిమా చేస్తారో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

