ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాపన్న గౌడ్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లెందుల రవి, మాజీ సర్పంచ్ సంధ్యారాణి కిరణ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కొలిపాక సుధాకర్, మాజీ ఎంపీటీసీ స్వర్ణలత పరుశరాములు, గడ్డమీద శేఖర్ గౌడ్, ముక్క వెంకటయ్య, ఉడుత అంజయ్య, రామ్ నరసయ్య, ఇల్లెందుల నరసింగరావు, బొమ్మన భరత్ గౌడ్, చెవ్వ కరుణాకర్, ఉడుత కుమార్ తదితరులు పాల్గొన్నారు.
