BAC Meeting – మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వెల‌గ‌పూడి – ఎపి అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు మార్చి 19వ తేది వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.. మొత్తం 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. నేడు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అధ్యక్ష‌త‌న జ‌రిగిన బిజినెస్ ఎడ్వైజ‌రీ క‌మిటీ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.. మార్చి 19కి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం – అవసరమైన మరో రెండ్రోజులు సభ నిర్వహించుకునేలా వెసులుబాటు క‌ల్పించారు. అందుకు మార్చి 20, 21 తేదీల‌ను రిజ‌ర్వ డేలుగా ఉంచారు. ఇక అసెంబ్లీలో ఈ నెల 28 వ తేదిన బడ్జెన్ ను ఆర్థిక మంత్రి ప‌య్యావులు కేశ‌వ్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.. దీనిపై మ‌రుస‌టి రోజు నుంచి చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. అలాగేఈ 15 రోజుల స‌మావేశాల‌లో ప్ర‌భుత్వం వివిధ బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *