B-forms | అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ పంపిణీ

B-forms | అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ పంపిణీ
B-forms | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థులకు ఆదివారం బీ ఫామ్ లను అందజేసింది. భీంగల్ మున్సిపాలిటీలో జనసేన జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. బాల్కొండ నియోజకవర్గ సమన్వయకర్త, భీంగల్ మండల మున్సిపల్ సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1వ వార్డు నుండి విశ్వనాథం సుమలత, 4వ వార్డు నుండి బచల్వార్ మాధవి, 5వ వార్డు నుండి ఆకుల సబితలకు బీఫామ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ సమన్వయకర్త శివసారి ఫణింద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన మా అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న భీంగల్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేనదేనని పేర్కొన్నారు.
అవినీతి రహిత పాలన కోసం ప్రజలు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించాలని కొరారు. ఈ కార్యక్రమంలో భీంగల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రామావత్, జిల్లా నాయకులు గణేష్, తేజ, జనసేన నాయకులు అర్జున్, దిలీప్, మహిళలు పాల్గొన్నారు.
