కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

జైనూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అక్షరాస్యతపై రైతులకు నా బర్డ్, సహకార బ్యాంక్ సౌజన్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నా బర్డ్ ఎఫ్ ఎల్ సి లోక రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జండగూడ పంచాయతీలో గల అల్లిగూడ గ్రామంలో సర్పంచ్ ఉయిక చందన్ షావ్ అధ్యక్షతన ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నా బార్డ్ డీడియం వీరభద్రుడు, ఎఫ్ ఎల్ సి రామ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు కేవైసీలు చేసుకోవాలని సురక్ష పథకాలపై అవగాహన పెంచుకోవాలని సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు నష్టపోకుండా పథకాలు సద్వినియోగం చేసుకునేలా నాబార్డ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో జండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షావ్, గ్రామ పటేల్ ఉయిక చిత్రు, జైనూర్ సహకార బ్యాంకు మేనేజర్ టి, రాజేశ్వర్, జై నూర్ సహకార కార్యదర్శి రాథోడ్ ప్రకాష్, రైతులు పాల్గొన్నారు.
