Awareness | ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం

Awareness | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం కలుగుతుందని దండేపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక అన్నారు. ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం ఎన్ఎం ఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫామింగ్) పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన సాగు ఖర్చు తగ్గడం, భూమి సారాన్ని పెంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం, భూమి సారవంతంగా ఎండిపోకుండా ఉండడం, పర్యావరణాన్ని కాపాడడం వలన రైతులు అధిక లాభాలు పొందుతారని అన్నారు. ఈ పథకంలో దండేపల్లి గ్రామానికి సంబంధించిన 125 ఎకరాలు, 2 సంవత్సరాల పాటు ఇట్టి పథకంలో భాగమైన రైతులకు ప్రోత్సాహకాలు, ప్రకృతి సాగులో పాటించాల్సిన పద్ధతులు, మెళకువల గురించి తోడ్పాటు అందించటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దండేపల్లి గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply