రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం

రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం

అలైవ్ అరైవ్ కార్యక్రమంలో కుభీర్ ఎస్సై శ్రీనివాస్
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని యువతకు పిలుపు

కుభీర్, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో మండలంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కొనసాగుతోందని ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం లోని పార్డి (కె), తదితర గ్రామాల్లో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడడం మానేయాలన్నారు.

టీనేజ్ పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వరాదని 18 సంవత్సరాల నుండి వారు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. సెల్ ఫోన్ వాడకం ఎంత మంచిదో అంతే చెడ్డదని ఎవరో ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదని ఓటిపల్లి చెప్తే మన అకౌంట్ లో డబ్బులు గుల్ల కావడం ఖాయమన్నారు. సెల్ఫోన్ వినియోగం వాట్సాప్ వినియోగాన్ని ఆయన యువకులకు లైవ్ లో పలు సూచనలు సలహాలు ఇచ్చి భద్రంగా వాడే విధానాన్ని తెలియజేశారు. ప్రజల భద్రతను పెంచడం మరియు చట్టాన్ని గౌరవించే వాతావరణాన్ని కల్పించడం పోలీసుల ముఖ్య ఉద్దేశమని అన్నారు.

ప్రజల కోసమే ప్రజల భద్రత కోసమే పోలీసులు ఎల్లప్పుడూ మీ ముందు ఉంటారని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. అనుకోకుండా తమ పిల్లలు సెల్ ఫోన్ వాడి ఓటీపీలు చెప్పి మోసపోతే డయల్ 1930 లేదా 100 కు ఫోన్ చేసి పోలీసుల తక్షణ సహాయాన్ని పొందవచ్చని దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బందెల గంగమణి సత్యనారాయణ, ఉప సర్పంచ్ నాయుడు పోశెట్టి, మాజీ వైస్ ఎంపీపి బీ. శంకర్, విడిసి అధ్యక్షుడు దుంపేటి రాములు, గోజల గజ్జరాం, పోలీసు సిబ్బంది, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply