సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన అవసరం

సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
తొర్రూరు,ఆంధ్రప్రభ : సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు, రోడ్డు భద్రతలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని తొర్రూరు సిఐ గణేష్ అన్నారు. మండలంలోని నాంచారి మడూరు గ్రామంలో ఎంజెపి బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) క్యాంపులో భాగంగా 5వ రోజు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావదన్నారు.అనంతరం వైద్యాధికారి డాక్టర్ నందన దేవి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు ఎస్సై ఉపేందర్, నాంచారి మడూరు సర్పంచ్ బంగారు రమేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ హరి ప్రసాద్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ గిరి ప్రసాద్,వైస్ ప్రిన్సిపాల్ రేవ్యా నాయక్, అధ్యాపకులు,వలంటీర్లు పాల్గొన్నారు.
