Avanigadda | మూతబడిన పీఎసీఎస్ కార్యాలయాలు..

Avanigadda | మూతబడిన పీఎసీఎస్ కార్యాలయాలు..
Avanigadda, ఆంధ్రప్రభ : దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని పీఎసీఎస్ ఉద్యోగులు సమ్మె చేయటంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పీఎసీఎస్ కార్యాలయాలు మూతబడ్డాయి. అవనిగడ్డ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు మండలాల్లోని పీఎసీఎస్ కార్యాలయాల్లో వేలాది మంది సంఘం సభ్యులు ఉన్నారు.
రైతులు పంట రుణాలు చెల్లించేందుకు, తీసుకునేందుకు కార్యాలయాలకు వస్తున్నారు. అయితే.. కార్యాలయాలు మూసి వేసి ఉండటంతో నిరాశతో వారు తిరిగి వెళ్లిపోతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వానికి తమ సమస్యను విన్నవించినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని, ప్రభుత్వ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతామని పిఎసిఎస్ ఉద్యోగులు తెలుపుతున్నారు.
