Avanigadda | భక్తుల భాగస్వామ్యం శుభ పరిణామం

Avanigadda | భక్తుల భాగస్వామ్యం శుభ పరిణామం
- నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్
- రాజశేఖరస్వామి దేవస్థానం ఆవరణ ఫ్లోరింగ్ పనులు ప్రారంభం
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పురాతన దేవస్థాన అభివృద్ధి, సుందరీకరణలో భక్తుల భాగస్వామ్యం శుభ పరిణామం అని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డలోని ప్రాచీన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖరస్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులకు దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు దేవస్థానం ఆవరణ ఫ్లోరింగ్ పనులు ఆయన పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సంతోష్ పవన్ వేదమంత్రాలతో అతిథులు, పాలకమండలిచే భూమిపూజ జరిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రాజశేఖరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమితులైన ఘంటసాల కన్నయ్య బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే దాతల సహకారం సమీకరించి అభివృద్ధి పనులను ప్రారంభించటం శుభ పరిణామమన్నారు. దేవస్థానం అభివృద్ధికి విస్తృత సహకారం అందిస్తున్న దాతలను, ప్రణాళికతో కృషి చేపట్టిన చైర్మన్ కన్నయ్యను, పాలకమండలి ప్రతినిధులను వెంకట్రామ్ అభినందించారు.

నూతన పాలకమండలి ఆధ్వర్యంలో ఈ దేవస్థానంలో భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ముందుగా వెంకట్రామ్ దేవస్థానంలో స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఎంపీటీసీ బొప్పన భాను, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, నాయకులు పరుచూరి దుర్గాప్రసాద్, కంచర్ల ఆనంద్, దేవస్థానం డైరెక్టర్లు అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, అవనిగడ్డ రమేష్, గాలం దుర్గ, కోసూరు అవినాష్, మత్తి శివపార్వతి, వెంకటేశ్వరరావు, హంస, లక్ష్మీ నరసమ్మ, ఎక్స్ అఫీషియో సభ్యులు ఘంటసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
