వెనుక మంత్రి లోకేష్

వెనుక మంత్రి లోకేష్
ఉండవల్లిలో సందడే సందడి

(ఆంధ్రప్రభ, మంగళగిరి) : విజయవాడ (Vijayawada) సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ (‘Auto Driver Serviceస) పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఉండవల్లి నుంచి ఆటోల్లో సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్ (Minister Lokesh) బయలుదేరారు. అంతక ముందు ఉండవల్లిలో డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కు మంగళగిరి చేనేత కండువాలు కప్పి మంత్రి లోకేష్ ఘనస్వాగతం పలికారు. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ లకు మద్దతు గా పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు తరలి వచ్చారు. మంత్రి లోకేష్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు. బాణాసంచా, తీన్ మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేసింది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాధవ్ పాల్గొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 15 వేల ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం చేస్తోంది. తొలి ఏడాది 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 2.64 లక్షల మంది ఆటో డ్రైవర్లు, 20,072 మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కి లభ్ది చేకూరుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న తరుణంలో,.. చిరువ్యాపారులు, మహిళ కూలీలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిలో షేర్ ఆటోలు నడిపే ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బ తినటంతో.. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని నిర్ణయం సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
