చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ (Choutuppal) మండలంలోని దండు మాల్కాపురం బుర్రోళ్ళగూడెం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఈ రోజు పాత పేపర్లను తీసుకువెళ్తున్న ఆటో (Auto) దగ్ధమైనట్లుగా చౌటుప్పల్ ఎస్సై ఎస్ కృష్ణమల్ తెలిపారు.

డ్రైవర్ కం ఓనర్ జడి నాగరాజు (Jadi Nagaraju) పెద్ద అంబర్ పేట గ్రామం నుంచి పాత పేపర్ ను తన ఆటోలో లోడ్ చేసుకొని విజయవాడ (Vijayawada) కు తీసుకు వెళ్తుండగా బొర్రోళ్ళ గూడెం గ్రామ సమీపంలో ఇంజన్ నుంచి మంటలు లేవడంతో గమనించిన డ్రైవర్ నాగరాజు అప్రమత్తమై వెంటనే ఆటోను నిలిపివేసి అందులో నుండి దూకేశాడు. ఆటోలో పేపర్ లోడ్ (PaperLoaded) ఉండటం వల్ల వేగంగా మంటలు అంటుకొని తగలబడిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై కృష్ణమల్ తెలిపారు.

Leave a Reply