ఆటో కారు, ఢీ..
నలుగురికి తీవ్ర గాయాలు..
పెబ్బేరు 44వ జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలేపల్లి గ్రామానికి చెందిన 16 మంది కూలీలు జోగులాంబ గద్వాల జిల్లాలోని తదితర గ్రామాలలో పత్తి చేను కూలి పనుల నిమిత్తం వెళుతున్నారు. గద్వాల నుంచి పెబ్బేరు వైపు వస్తున్న కారు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టగా ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ రవితో పాటు గీరమ్మా, చెన్నమ్మ, అక్కమ్మ అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

