ఆంధ్రప్రభ, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి : గోదావరి పరవళ్లు తొక్కుతుంది. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ను అధికారులు జారీ చేశారు. తెలంగాణ , మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణాహిత మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటం, సరస్వతి బ్యారేజ్ నుండి గోదావరికి భారీగా వరద తాకిడి పెరుగుతుంది. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం ప్రధాన పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం గోదావరి నీటి మట్టం 12.370 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. 13.460 మీటర్లు డేంజర్ సమీపిస్తుండంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు 9,71,880 క్యూసెక్కులు వస్తుండడంతో 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో అవుట్ ఫ్లో దిగువకు పంపిస్తున్నారు.
కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..
