Australia Ban :  నో డిస్ట్రక్ట్​.. బాల్యం  

Australia Ban :  నో డిస్ట్రక్ట్​.. బాల్యం  

ఆస్ల్రేలియాలో  సోషల్​ మీడియాపై వేటు

ఇక బాలల ఖాతాలు నిషేధం

భారత్​ అమ్మానాన్నల హర్షం

ఆలోచనలో అమ్మానాన్న

ఇక మోదీ ఆలోచనేంటో?

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్) ​

ఆబాల గోపాలం అరచేతిలో ప్రంపంచ వీక్షణం ఎంతో ప్రమాదకరమని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia New History)  కొత్త హిస్టరీని క్రియేట్​ చేసింది.    తమ  దేశంలోని  16 ఏళ్లలోపు బాలలు  సోషల్ మీడియాను వినియోగాన్ని (Socail Media Ban)   నిషేధించింది.   

Australia Ban

ఈ నిర్ణయంతో.. ప్రపంచ దేశాలన్నీ (In World )  ఆశ్చర్యపోయాయి. వాస్తవ స్థితిగతులపై తీవ్ర చర్చోప చర్చలు (Discussions)  ప్రారంభమయ్యాయి. మరీ ముఖ్యంగా .. ప్రపంచలోనే అత్యధిక సోషల్​ మీడియా యూజర్ల ఖాతా చరిత్ర కలిగిన భారత దేశంలోనూ.. (In India) సోషల్​ మీడియా కబంధ హస్తాల నుంచి 49 కోట్ల బాలలను భారతావని కాపాడుతుందా? సోషల్​ మీడియాకు దాసోహమవుతుందా? ఇవీ తాజాగా జవాబు కోసం వెతుకుతున్న ప్రశ్నలు.

Australia Ban : ఇక ఇండియా ఆలోచనేంటీ?

Australia Ban

హిందూమత ధర్మ రక్షణ లక్ష్యంతో.. భారతావనిలో అనేక సంస్కరణలు చేపట్టిన భారత ప్రభుత్వం కూడా .. సోషల్​ మీడియాలో బాలల కట్టడికి దిగుతుందా? అనే చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. గురుకుల విద్యతో (Gurukula vidya)  ఉత్తమ రాజులను అందించిన ఈ రామరాజ్యంలో.. సోషల్​ మీడియాతో అమ్మానాన్న కలవర పడుతున్నారు.

సెల్​ ఫోన్​ కొని ఇవ్వలేదని బాలలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలెన్నో తెరమీదకు వచ్చాయి. వయసు  తారతమ్యం లేదు. అశ్లీల, అనైతిక (Sexually Explicit) చర్యలకు అడ్డూ అదుపూలేదు. లైంగిక దాడులు (Sexual Assaults)  పెరిగిపోయాయి. ఈ నేరాల్లో  మైనర్లు (Minors) వాటా బాగా పెరిగింది. భారత దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలనే మైనర్లుగా గుర్తించారు. వీరి సంఖ్య ప్రస్తుతం 49 కోట్లు. వీరిలో కనీసం 30  కోట్ల మంది (30 crore)  సోషల్​ మీడియా యూజర్లు ఉన్నారని అంచనా. సోషల్​ మీడియా టర్నోవరులో (Social Media Turn over)  అత్యధిక భాగం భారత దేశానిదే. 2030 నాటికి 429 కోట్ల డాలర్లు (రూ.38,610 కోట్లు) ఈ టర్నోవరు చేరుతుంది.

Australia Ban

Australia Ban

 ఇంత పెద్ద బిజినెస్​ వేదికను సోషల్​ మీడియా కోల్పోవటానికి ససేమిరా అంగీకరించదు. కానీ.. భారత దేశంలో భావితరాల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఈ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. రాజకీయ శక్తి ఎదుగుదలకు ఎంతో ఉప యుక్తంగా మారిన సోషల్​ మీడియాను పాలకులు దూరం చేసుకోలేరు. ఇప్పటికే ఏపీలో కృత్రిమ మేథస్సు (Artificial Intellegence)  కు పెద్ద పీట వేస్తున్నారు. ఈ చర్యలు ఎక్కడికి దారి తీస్తాయో? భావి తరాల స్థితి గతి ఏమిటో.. ఇవే ప్రశ్నలు.. యావత్​ భారతావనిని వేధిస్తున్నాయి.

Australia Ban : పురుడు పోసిన ఆస్ట్రేలియా

Australia Ban

ఆస్ట్రేలియా విధించిన  ఈ  కొత్త, కఠిన నిబంధనలు (New Regulations)  బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.  ఈ సంస్కరణతో  బాల్యం ధ్వంసం కారాదని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది   ప్రభుత్వం అనాలోచిత చర్య కాదని, భావితరాల ఉజ్వల భవితపై తల్లిదండ్రులకు ఈ నిర్ణయం మరింత భరోసా ఇస్తుందని  ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

2024 నవంబర్‌లో ఆస్ట్రేలియా  పార్లమెంట్ (Astralia Parlament)  ఆమోదించిన చట్టాల ప్రకారం, 16 ఏళ్ల లోపు  బాలల పేరిట (Under 16 Chidren)   సోషల్​ మీడియా     ఖాతాలు నిషేధం.  బాలల ఖాతాలు కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై   కఠిన చర్యలు తప్పవు. ఫేస్‌బుక్ (Face Book), ఇన్‌ స్టాగ్రామ్ (In sta gram), స్నాప్‌ చాట్ (Snap Chat), టిక్‌టాక్ (Tik Tak), ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ సహా మొత్తం 10 సోషల్​ మీడియా  ప్లాట్‌ఫామ్‌లకు ఈ హెచ్చరిక​లు అందాయి.

Australia Ban : టెక్ దిగ్గజాలదే బాధ్యత

Australia Ban


ఈ చట్టంలోని కీలక అంశం ఏమిటంటే, నిషేధాన్ని అమలు చేసే బాధ్యత (Response)  పూర్తిగా సోషల్ మీడియా సంస్థలదే. తప్పుడు ఐడీలు లేదా ఏఐ ఆధారిత ఫొటోలు అప్​ లోడ్ చేస్తే చర్యలు తప్పవు.  చిన్నారుల ఖాతాలను తొలగించే పూర్తి బాధ్యత టెక్ దిగ్గజాలదే. ఒకవేళ పిల్లలు నిబంధనలు ఉల్లంఘించినా,  బాల ఖాతాదారులకు, తల్లిదండ్రులకు   ఎలాంటి శిక్షలు ఉండవు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది.

టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సిందే. లేని $49.5 మిలియన్ డాలర్ల జరిమానా (Penality)  విధిస్తారు. ( ఇండియన్​  కరెన్సీలో రూ.4,500 కోట్లు) జరిమానా చెల్లించాల్సిందే. అకౌంట్  క్రియేట్ సమయంలో ఇచ్చిన  వివరాల ఆధారంగా పలు సంస్థలు అకౌంట్ డీయాక్టివేషన్​  (De Activation) పనిలో నిమగ్నమయ్యాయి. 16 ఏళ్లలోపు బాలల  ఫేస్​ బుక్​ . ఇన్​ స్టా గ్రామ్, థ్రెడ్స్ (Threds)  అకౌంట్లను డిలీట్ చేయాలని  హె మెటా (Hi Meta)  గత వారమే రంగంలోకి దిగింది. 

Australia Ban

Australia Ban

 దీని పరిధిలోకి రాని   అకౌంట్ పొరపాటున నిషేధానికి గురైతే.. ప్రభుత్వ ధ్రువీకరణ  చూపించడం లేదా వీడియో సెల్ఫీ ఆధారంగా ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని.. సంబంధిత డాకుమెంట్లనూ పరిశీలిస్తామని సోషల్​ మీడియా సంస్థలు  చెబుతున్నాయి.  అదెంత వరకు పిలవుతుందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. డమో.. లేదంటో షేక్ అకౌంట్లు వాడో నిబంధల్ని అతిక్రమించే అవకాశాలూ ఉన్నాయి.

Australia Ban : సోషల్​ మీడియాలో  అలజడి

Australia Ban

సోషల్​ మీడియా వేదిక నుంచి బాలలను దూరం చేసే చట్టాన్ని ఆస్ట్రేలియా అమలు చేస్తే.. ఇదే బాటలో  మిగిలిన దేశాలు పయనిస్తే.. ఏంచేయాలో.. సోషల్​ మీడియా దిగ్గజాలు ఇప్పటికే చర్చల్లో దిగాయి. వాస్తవానికి ప్రపంచం సోషల్​ మీడియా వాణిజ్యం తాజా (Social Media Turn over)   టర్నోవరు 25,000 కోట్ల డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.22.50 లక్షల కోట్లు). ఎందుకంటే.. తాజా ప్రపంచ జనాభా 809 కోట్లు కాగా.. ఇందులో 500 కోట్ల మంది సోషల్​ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2028 నాటికి ప్రపంచంలో సోషల్​ మీడియా బిజినెస్​ 413 బిలియన్​ డాలర్లు చేరుతుందని అంచనా. అంటే.. ఇండియన్​  కరెన్సీలో  రూ. 371 లక్షల కోట్లు అని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.

ఇక ఆస్ట్రేలియాలో బాలలను దూరం చేయటంతో  సోషల్​ మీడియాకు నష్టమెంత? ప్రపంచంలోనే అత్యధిక మంది సోషల్ ​ మీడియా ఖాతాదారులు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈ దేశం జనాభా 2.8 కోట్లు ఇందులో 77 .7 శాతం మంది సోషల్​ మీడియా ఖాతాదారులే. ఈ దేశంలో సోషల్​ మీడియా టర్నోవరు వాట ఎంతంటే.. ఏటా 900 కోట్ల డాలర్లు. (ఇండియన్​ కరెన్సీ ప్రకారం 8100 కోట్ల రూపాయలు) ఇందులో ఈ నిషేధంతో.. తాజాగా రూ.1000 కోట్ల నష్టం తప్పదు. ఇందులో సింహభాగం మెటా ఆధీనంలోని ప్లాట్​ ఫారందే. ఆస్ట్రేలియా రీతిలో మిగిలిన దేశాలు కూడా నిషేధం బాటలో పయనిస్తే.. నెత్తిన చెంగు తప్పదని సోషల్​ మీడియా దిగ్గజాలు ఆందోళన చెందుతున్నాయి.

Australia Ban : ఆస్ట్రేలియా  వాదనేంటీ ?

Australia Ban

సోషల్ మీడియాలోని కొన్ని  ఫ్లాట్​ ​ ఫామ్స్​..  యువతను  ఫోన్ ​ స్ర్కీన్​ లకు   బంధీ చేస్తున్నాయి.  యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2025లో ఆస్ర్టేలియా ప్రభుత్వం జరిపిన ఒక సర్వేలో.. ఇన్​ స్టా గ్రామ్​  యూజర్లలో 3.5 లక్షల మంది 13 నుంచి 15 ఏళ్లలోపు ఆస్ట్రేలియా  మైనర్లు (Australia Minors)  ఉన్నారు.  వీరిలో   10  నుంచి -15 ఏళ్ల కౌమార దశ  పిల్లల్లో 96 శాతం మంది సోషల్ మీడియాకు దాసోహం అయ్యారు.  వీరిలో  70 శాతం మంది హింస (Violemce) , ఆత్మహత్య (Sucide)లను ప్రోత్సహించే (Provecate)  హానికర కంటెంట్ కు ఆకర్షితులవుతున్నారు.  

ఈ హానికర ప్రభావాలను నియంత్రించటమే ప్రభుత్వ లక్ష్యం..  ఈ నిషేధంతో సమాజ భవిష్యత్తును కాపాడటమే ధ్యేయం అని ప్రభుత్వం చెబుతోంది. తల్లిదండ్రుల బాధను విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అల్బనీస్ మరోమారు స్పష్టం చేశారు. పిల్లలను ఆన్​ లైన్​  బులీయింగ్ (Bulying)  వేధింపులు , హనికర కంటెంట్ క్కు దూరంగా ఉంచడం… తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్ ఉద్ఘాటించారు.  

Australia Ban : మంచిదే.. కానీ… 

Australia Ban

సిడ్నీ కేంద్రంగా పనిచేసే డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్టు (Digital Freedom Project)  అనే సంస్థ ఈ చట్టాన్ని (Petioned in Highcourt)  సవాలు హైకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టం అమలు కొంత ఇబ్బందిగానే ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తోంది.  

న్యాయపరమైన సవాళ్లకు, టెక్ దిగ్గజాల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ చట్టాన్ని  అమలు చేసి తీరుతామని సమాచార మంత్రి అమికా వెల్స్ స్పష్టం చేశారు.   ఆస్ట్రేలియా ఇంటర్నెట్ సేఫ్టీ రెగ్యులేటర్ (Internet safety Regulator)  ఈ కఠిన నిబంధనలు ఎలా అమల విషయాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ALSO READ : America  Rice  Dispute  భారత్ బియ్యంపైనా ట్రంప్​ అక్కసు

ALSO READ : Tsunami in Japan | ఫసిఫిక్​ తీరంలో భయం భయం

ALSO READ : Massive Blaze in jakarta   ఇండోనేషియాలో  22 మంది ఆహుతి

Leave a Reply