Attack | యువకుడు మృతి

Attack | యువకుడు మృతి

Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఓ యువకుడిపై దారుణ దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సారంగపూర్ ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తున్న అక్షయ్ అనే యువకుడిపై కత్తులతో దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు అతనిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.గాయాల తీవ్రతతో అక్షయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడికి పాత కక్షలే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply