ATMS System | తెలంగాణలో రవాణా విస్తరణ చేపట్టాలి

ATMS System | తెలంగాణలో రవాణా విస్తరణ చేపట్టాలి

  • రోడ్ల భద్రతపై కేంద్రం పటిష్ట చర్యలు తీసుకోవాలి
  • గ్రామీణ ప్రాంతాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
  • పార్లమెంట్‌లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ATMS System | వరంగల్, ఆంధ్రప్రభ : సమిష్టి పాలనలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ విస్తరణ,రోడ్ల నిర్మాణాలకు నిధుల కేంద్ర ప్రభుత్వం(Central Govt) తగినన్ని నిధులకు కేటాయించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.

అలాగే జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాల నియంత్రణ అంశాలపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. ప్రధానంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.

సెంట్రల్ రోడ్(Central Road) అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సి ఆర్ ఐ ఎఫ్ ) పథకం కింద తెలంగాణకు గత నాలుగేళ్లలో గణనీయంగా నిధులు కేటాయించడమే కాక విడుదల చేసిన్నట్లు మంత్రి వివరించారు.
2022–23 సంవత్సరంలో రూ.304.27 కోట్లు కేటాయించగా రూ.275.89 కోట్లు విడుదల చేశామన్నారు.
2023–24 సంవత్సరంలో రూ.335.09 కోట్లు కేటాయించగా రూ.366.38 కోట్లు విడుదల చేశామన్నారు.
2024–25 ఏడాదికి గాను రూ.335.58 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.335.59 కోట్లు విడుదల చేశామన్నారు.ఇక
2025–26 సంవత్సరానికి అక్టోబర్ 31 వరకూ రూ.367.17 కోట్లు కేటాయించి,రూ.344.49 కోట్లు విడుదల చేసినట్లు వివరణ ఇచ్చారు.
కొన్ని సంవత్సరాల్లో విడుదల కేటాయింపుల కంటే ఎక్కువగా ఉండటానికి పాత ఖాళీ నిల్వలు సర్దుబాటు కావడమే కారణమని మంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. ఈ నిధులు రాష్ట్ర రహదారి సంరక్షణకు, వరంగల్ వంటి ప్రాంతాల కనెక్టివిటీకి కీలకమని వివరించారు.

ప్రమాదాల నియంత్రణ కోసం ఎన్ఎచ్‌ఏఐ అత్యాధునిక ఏటీఎంఎస్ వ్యవస్థ(ATMS System)ను 4–6 లేన్ హైవేలపై అమలు చేస్తోందని గడ్కరి అన్నారు. 24×7 సీసీటీవీ, ఏ ఎన్ పి ఆర్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.

అలాగే రోడ్డు భద్రతపై అవగాహన కోసం సోషల్ మీడియాలో ప్రచారాలు, ప్రముఖుల సందేశాలు, డ్రైవర్ల ఆరోగ్య శిబిరాలు, ఓవర్‌ లోడింగ్–ఓవర్‌స్పీడ్–డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దాడులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అభ్యర్థించారు.

Leave a Reply