Birthday | ప్రజావేదిక కార్యాలయంలో…
Birthday | గుడివాడ, ఆంధ్రప్రభ : శాసనసభ్యులు వెనిగండ్ల రాము పుట్టినరోజు వేడుకలు గుడివాడ పట్టణంలో సోమవారం పండగలా జరిగాయి. ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక టీడీపీ (TDP) కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, యువత పట్టణ ప్రముఖులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సామాజిక ,స్వచ్ఛంద సంస్థల పెద్దలు, నోట్ బుక్స్, పూల మొక్కలు, జ్ఞాపికలతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలు, పూల మాలలు, బొకేలు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే రాము సున్నితంగా తిరస్కరించారు. ముందుగా స్వగృహంలో మాతృమూర్తి శాంతమ్మ, కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.
పోలీస్ (Police) శాఖ తదితర ప్రభుత్వ శాఖలు, అధికారులు, పలువురు కూటమి నాయకులు, వివిధ సంస్థలు, అధికారులు, అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ లను ఎమ్మెల్యే రాము కట్ చేసి నాయకులు, అధికారులకు తినిపించారు. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో, ఎమ్మెల్యే రాము ఆత్మీయంగా మాట్లాడారు. ఎమ్మెల్యే రాముతో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు యువత, కూటమి శ్రేణులు ఉత్సాహం చూపించారు.
పుట్టినరోజు సందర్భంగా దేవాలయాల్లోని వేద పండితులు ఎమ్మెల్యే (MLA) రాముకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. వేడుకలను పురస్కరించుకొని గుడివాడలోని పలు ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు దేవాదాయ శాఖ సమకూర్చిన భోజనం ప్లేట్లు, బెడ్ షీట్లను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. అనంతరం ముస్లిం మత గురువులు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పేద నాయి బ్రాహ్మణడు ఉపాధి నిమిత్తం తెలుగు యువత నాయకులు లోయ విజయ్ సహకారంతో ఏర్పాటు చేసిన బార్బర్ షాప్ ను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు.
పల్లెబాట సాయంకాల దినపత్రిక ముద్రించిన బాస్ వెనిగండ్ల రాము (Ramu) పుస్తకాన్ని ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల రూపొందించిన జూట్ బ్యాగులను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాము పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకుడు నిరంజన్ సమకూర్చిన 10వేల నగదును, ఎమ్మెల్యే రాము విద్యార్థినీకు స్కాలర్షిప్ గా అందించారు. కేక్ కటింగ్ అనంతరం ఏపీ ఎస్డబ్ల్యూసి చైర్మన్ మీడియాతో మాట్లాడారు. సోదరుడు శాసనసభ్యులు రాము పుట్టినరోజు వేడుకలు గుడివాడలో అశేష అభిమానుల మధ్య ఘనంగా జరగడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలందరి ప్రేమతో చరిత్రను తిరగరాసిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే రాము అని కొనియాడారు. ప్రజలకు (People) ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎమ్మెల్యే రాము అమలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలందరికీ ప్రేమ, సహకారం పై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే రాము నాయకత్వంలో రాబోవు రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు,ఎన్టీఆర్ స్టేడియం (Ntr Stadiam) కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ, నందివాడ, రూరల్ మండలాల టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, దానేటి సన్యాసిరావు, వాసే మురళీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డరవికుమార్, విశ్వ భారతి విద్యాసంస్థల చైర్మన్ పొట్లూరు శ్రీమన్నారాయణ, సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు, పిన్నమనేని బాబ్జి, లింగం ప్రసాద్, డాక్టర్ గోర్జీసత్యనారాయణ, పండ్రాజు సాంబయ్య, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, మండల పరిషత్, దేవాదాయశాఖ, విద్యాశాఖ, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, దేవాలయాల కమిటీలు, గుడివాడ టౌన్, నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్, పరిధిలోని కూటమి శ్రేణులు, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల నాయకులు, అంగలూరు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు, వేలాదిగా అభిమానులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, ఎస్సీ సెల్ బీసీ సెల్, మైనార్టీ సెల్ ల నాయకులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

