నాగభూషణం మరణిస్తూ… ఇద్దరి అందులకు చూపు…

నాగభూషణం మరణిస్తూ… ఇద్దరి అందులకు చూపు…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ రామన్నపేట బొడ్రాయి నివాసి ఇరుకుల్ల నాగభూషణం (85 ) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు భార్య అఖిలాండేశ్వరి సమాజ హితం కోరి, ‘నేత్రదానం ‘చేయడానికి అంగీకరించగా, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్, ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ సిబ్బంది నేత్ర సేకరణ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనదనీ నేత్రదానా అధ్యక్షుడు కోన్ రెడ్డి మల్లారెడ్డి తెలిపారు.

నాగభూషణం నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునిచ్చిన వారై నేత్ర వైద్య విద్యకు తోడ్పడిన వారైనారు.కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది. వివరాలకు 8790548706, 8340892985′ 9490133650 సెల్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరినారు. కార్యక్రమంలో బంధుమిత్రులు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply